పులిహార గోంగూర

కావలసిన వస్తువులు:-1 కిలో గోంగూర, 1/2 కిలో పచ్చికారం, 1/2 కిలో ఉప్పు, (దంచుకోవాలి),150 గ్రా| చింతపండు, 1/2 కిలో నూనె

తాలింపుకు : 10 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూనుల పచ్చిశెనగపప్పు, టేబుల్ స్పూన్లు చాయమినపప్పు, 2 టేబుల్‌స్పూన్లు ఆవాలు తయారుచేయు విధానము :- చింతపండు కొంచెం నీళ్ళలో నానబెట్టి పులుసు చేయండి, ఆ పులుసును బాగా ఉడకబెట్టి చిక్కనిగుజ్జుగా చేసుకోండి. గోంగూరను
కాడలు తీసి, శుభ్రంచేసుకుని, బాగా కడిగి ఇంట్లో ఆరబెట్టండి. తడిపూర్తిగా ఆరిపోయిన తరువాత తీసి ఉప్పును కలిపి రుబ్బురోలులో గానీ, గైండర్ లో గాని మెత్తగా రుబ్బండి. రుబ్బుతుండగా కారం, చింతపండు గుజ్జులను కూడా చేర్చి బాగా మెత్తగా మెదిగిన తరువాత తీయండి, అరకిలోనూనెలో తాలింపు గింజలన్నింటితో తాలింపువేసి, నూరుకున్న పచ్చడిని వేసి,కలిపి దింపి చల్లారిన తరువాత నుంచి వాడుకోవచ్చు.

ఒక సంవత్సరము నిలువ తేలికగా ఉంటుంది

కామెంట్‌లు