కావలసినవి
అరటికాయ: ఒకటి, పెరుగు: కప్పు పచ్చిమిర్చి: రెండు, ఆవాలు: అరచెంచా సెనగపప్పు: అరచెంచా, మినప్పప్పు: అరచెంచా, కరివేపాకు: రెండు రెబ్బలు ఎండుమిర్చి: ఒకటి, ఉప్పు: తగినంత, నూనె: రెండు చెంచాలు, పసుపు: చిటికెడు ఆవపిండి: అరచెంచా
తయారీ విధానం:
అరటికాయను క్కర్ లో మూడుకూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఆ తరువాత చెక్కుతీసి ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద బాణలి పెట్టి, ఆవాలు సెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేయించి కరివేపాకు, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషా లయ్యాక దింపేయాలి. ఈ తాలింపుతో పాటూ మిగిలిన పదార్థాలన్నీ పెరుగులో వేసి బాగా కలిపితే చాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి