కావలసినవి
తాజా కొబ్బరి తురుము: అరకప్పు, పెరుగు: కప్పు, అల్లం: చిన్న ముక్క పచ్చిమిర్చి: రెండు, నీళ్లు: పావుకప్పు ఉప్పు: తగినంత, కరివేపాకు రెబ్బలు రెండు, ఆవాలు: చెంచా, ఎండుమిర్చి రెండు, నూనె: టేబుల్ స్పూను
తయారీ విధానం
పెరుగును ఓ గిన్నెలో వేసి బాగా గిలకొట్టి పెట్టుకోవాలి. మిక్సీలో కొబ్బరి తురుము, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు నీళ్లు తీసుకుని మెత్తగా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని గిలకొట్టిన పెరుగులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టౌమీద బాణలి పెట్టి నూనె వేసి ఆవాలు ఎండుమిర్చి, కరివేపాకు వేయించాలి. అన్నీ వేగాక ఈ తాలింపును పెరుగులో వేసి బాగా కలిపితే చాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి