గోంగూర నిలవ పచ్చడి

కావలసిన వస్తువులు:-1 కిలోగోంగూర (పచ్చడిగోంగూర), 1/4 కిలో ఎండు మిర్చి, 1/4 కిలో చింతపండు,50 గ్రా|| ఆవాలు (పిండికి),50 గ్రా॥॥ మెంతులు (పిండికి), ఒక డబ్బా ఉప్పు

తాలింపుకు:-2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు,1 టేబుల్ స్పూను ఆవాలు, టేబుల్ స్పూను చాయమినపప్పు, 100 గ్రా॥ వెల్లుల్లిపాయలు, 1/4 కిలో
నూనె తయారుచేయు విధానం:-గోంగూర ఆకునుకడిగి,నీడన ఆరబెట్టండి. నీరంతా పూర్తిగా ఆరిపోయిన తరువాత తీసి, ఉత్త కళాయిలో ఆకుకొంచెంగా వడిలేలా వేయిం చండి. వేయించినఆకును ఒక శుభ్రమయిన జాడీలోవేసి, డబ్బాడుఉప్పు ఆ ఆకుల్లోచల్లి మూతబెట్టి మూడు రోజులు ఊరనివ్వండి. మూడవరోజున చింతపండును కొంచెం నీళ్ళలో నానబెట్టి పిసికి చక్కని రసం తయారుచేయండి. ఆరసాన్ని బాగాచిక్కగా అయేలా ఉడికించి,దించి చల్లార్చండి. కొద్దిగా నూనెను కళాయిలో తీసుకుని, ఎండుమిర్చిని చక్కగా వేయించి తీసి రోటిలో వేసి మెత్తగా పొడికొట్టండి. రుబ్బురోలులో ఊరిన గోంగూరను, కారం, మెంతిపిండి వేసి, ఉడికించిన చింతపండు గుజ్జును చల్లుతూ మెత్తగా రుబ్బండి

నూనెతో తాలింపు వేసి, చివరగా వలిచిన వెల్లుల్లి రేకలను వేసి, నూరిన పచ్చడిలో కలిపి, జాడీలో నిలువచేయండి. సంవత్సరం తేలిగ్గా నిలవ ఉంటుంది

చేయండి ఆపులుసును బాగా ఉడకబెట్టి చిక్కనిగుజ్జుగా చేసుకోండి. గోంగూరను

కామెంట్‌లు