మామిడికాయ ఊరగాయ(ఆవకాయ)

కావలసిన వస్తువులు :-25మామిడికాయలు (చిన్నరసాలు),లేదా 12 పెద్ద రసాలు, 1శేరు కారం(3 1/2 డబ్బాలు), 1 శేరుఉప్పు (దంచినమెత్తటి ఉప్పు) 1/2 శేరు, అవపిండి, 100గ్రా||మెంతిపిండి, 1/4 కిలో వెల్లుల్లిపాయలు, 1 కిలో నూనె

తయారుచేయు విధానము :- మామిడి కాయలను శుభ్రంగా కడిగి ముక్కలు కొట్టించుకోండి. జీడితీసి, ముక్కలు శుభ్రమయిన పొడిబట్టతో తుడుచుకోండి ఒక బేసిన్ లో కారం, ఉప్పు మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లిరేకులు ఇవన్నీ కలిపి అందులో 1/4 కిలో నూనెను కలిపి, అందులో శుభ్రంగా పెట్టుకున్న మామిడి ముక్కలను వేసి, బాగా కలపండి

జాడీనికడిగి, ఎండలో ఆరబెట్టండి. ఆరిన తరువాత శుభ్రంగా లోపల, పైన తుడిచి,కలిపిన మిశ్రమాన్ని అందులో వేయండి. మూత పెట్టి, మూడు రోజులు ఊర బెట్టండి.మూడోరోజు, జాడీనితీసి, శుభ్రమయిన పొడిగరిటెతో బాగా కలిపి, మిగిలిన నూనెను అందులో పోయండి. ఒకవారం ఊరిన తరువాత నుండి, పచ్చడి

తయారుగా ఉంటుంది. సంవత్సరం పెగానే నిలవ ఉంటుంది

కామెంట్‌లు