ఎండు అవకాయ

కావలసిన వస్తువులు :- 25 మామిడికాయలు (చిన్నరసాలు),1 శేరు కారం 1 శేరు ఉప్పు, 1/2 శేరు ఆవపిండి, 100 గ్రా|| మెంతిపిండి, 1/4 కిలో వెల్లుల్లి
పాయలు, 1కిలోనూనె,టేబులు స్పూను పసుపు

తయారుచేయు విధానము :- ఆవకాయ పచ్చడికి లాగానే ముక్కలు కొట్టించి, తుడిచి శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న ముక్కలు, ఉప్పు, పసుపుకలిపి, జాడీలోపోసి, 3 రోజులు ఊరనివ్వండి. మూడోరోజు ఒకబేసిన్లో ముక్కలు పట్టేటంతటి శుభ్రమయిన బుట్టను ఉంచి

ఊరిన ముక్కలను జాడీలోనుండి తీసి అందులో పోసి, ఊరిన రసం అంతా బుట్ట నుండి క్రింద ఉంచిన బేసిన్లోకి జారిపోతుంది. రసం ఓడ్చిన ముక్కలను మాత్రం ఎండలో ఆరవేయండి. రసాన్ని తిరిగి జాడీలో పోసేయండి. ముక్కలను 3 రోజులు మంచి ఎండలో బాగా ఎండనివ్వండి. ఒక బేసిన్లో ఊటను తీసుకుని, అందులో కారం, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిరేకలు, నూనెను పోసి కలపండి. అందులో ఎండిన మామిడి ముక్కలు పోసి, బాగా కలిపి, తీసి, శుభ్రమయిన జాడీలోపోసి, మూత పెట్టండి. రెండు సంవత్సరాలు తేలికగా నిలువ ఉంటుంది ఇష్టమున్నవాళ్ళు 1/4 కిలో పచ్చిశనగలు, కారం వగైరా కలుపు తున్నప్పుడు
కలుపుకోవచ్చు

కామెంట్‌లు