కావలసిన వస్తువులు :- 50 నిమ్మకాయలు, 1/2 కిలో కారం, 1/2 కిలో ఉప్పు, 2 టేబుల్ స్పూనుల పసుపు
తయారుచేయు విధానము : ఉప్పు మెత్తగా దంచాలి. నిమ్మకాయలను శుభ్రంగా కడిగి, తుడిచి 30 కాయలను ముక్కలుగా కోసుకోండి. మిగతాకాయలను పిండి రసంతీసుకోండి. ఆ ముక్కలకు ఉప్పు, పసుపు, పిండిన నిమ్మరసం కలిపి, జాడీలో 3 రోజులు ఊరబెట్టండి. మూడవరోజున, ఊటనుంచి ముక్కలను పిండి తీసుకొని
రెండు రోజులు బాగా ఎండబెట్టండి. మూడవరోజున ఊటలో ఎండిన ముక్కలను, కారాన్ని వేసి బాగా కలిపి మూల పెట్టండి. పదిరోజులు ఊరిన తరువాత నుండి తీసివాడుకోవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి