కావలసిన వస్తువులు :-25 మామిడికాయలు, 3/4 శేరుకారం, 1 శేరు ఉప్పు 1/4 శేరు ఆవపిండి, 100 గ్రా|| మెంతిపిండి, 1 టేబుల్ స్పూను పసుపు తాలింపుకు:50 గ్రా| ఆవాలు, 25 గ్రా॥ పండుమిర్చి, 25 గ్రా॥ వెల్లుల్లిపాయలు 1/2 కిలో నూనె
తయారుచేయు విధానము:- మాగాయకు, మామిడికాయలను పై చర్మాన్ని చెక్కుకుని నిలుపుగా పలుచని బద్దలుగా సనన్ని ముక్కలు కోసుకోవాలి. ఈ ముక్కలలో ఉప్పు, పసుపు కలిపి, ఒక జాడీలోపోసి 3రోజులు ఊరబెట్టండి. ఊరిన ముక్కలను రసం ఓడ్చి తీసి 2 రోజులు ఎండనివ్వండి. బాణలిలో 1/2 కిలోనూనెను పోసివేడి చేసి, ఆవాలు ఎండుమిర్చి, వెల్లుల్లిరేకలనుపోసి కొంచెం వేగిన తరువాత దించి నూనెతో సహా కలుపుకున్న మామిడిముక్కల మిశ్రమంలో పోసి, బాగా కలిపి శుభ్రమైన జాడీలో పోసి మూతనుంచి నిలువచేయండి. 2సంవత్సరాలు తేలికగా నిలువ ఉండే పచ్చడి ఇది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి