నక్క బావ


  అనగా అనగా ఒక అడివిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తుల మారిది. అది ఎక్కడినించి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు దాని తరహా అంతా చిత్రంగా ఉండేది అందుకని మిగతా నక్కలన్నీ "నువు మా కులముదానివే కాదు పొ" మన్నవి. దానితో మాట్లాడటంకూడా మానివేసినై .

  ఇక నక్క ఏమి చేస్తుంది . అక్కడ తన ఆటలు సాగకపోయేవరకు అడివికి దగ్గరగా ఉన్న ఊరు పోయి అక్కడ మంగలివానితో స్నేహం చేసుకున్నది. పాపం, ఆ మంగలి చాలా మంచివాడు అతనికి ఈ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తియ్యతియ్యగా మాట్లాడేది అది నిజమని మంగలి నమ్మాడు

  వాళ్లిద్దరికీ మంచి స్నేహం కలిసింది. అది ఒకనాడు నక్క మంగలితో అన్నది "మంగలి మామా, మంగలి మామా ! మనం పళ్లతోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది ? మనం తిన్నన్ని తినవచ్చు, మిగతావి అమ్ముకుని పొది నిండా డబ్బులు పోసుకోవచ్చు.”

  పాపం మంగలికి ఈ మాటలు వినేసరికి నోరు వూరింది మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరిటి మొక్కలూ తెచ్చి తోటవేశాడు. అక్కడక్కడా గుమ్మడిపాదులూ, దోసపాదు లూ పెట్టాడు. తనూ పెళ్లామూ కలిసి పాదులుచేసి, నీళ్ళు తెచ్చి చెట్లకు పోసేవాళ్ళు. నక్క పైన కర్ర పెత్తనం చేస్తూ కావిలి కాస్తున్నాననేది. కొన్నాళ్ల కు తోట కాపుకు వచ్చింది. నక్క రాత్రంతా మేలుకుని కడుపు ఉబ్బేదాకా, పళ్ళు కాయలు మెక్కేది. ఒక పండు కాయ కనపడనిచ్చేది కాదు

  ఒకనాడు మంగలి “నక్కబావా, నక్క బావా ! తోటలో కాయలేమైనా ఉన్నా యా?" అని అడిగాడు. “ఇప్పుడెక్క డివి? వానాకాలం వస్తేగా దొరికేదీ ?" అన్నది నక్క పాపం, మంగలి నమ్మాడు. వానాకాలం వచ్చినాక అడిగాడు. వానాకాలంలో ఎక్కడన్నా కాయలు ఉంటాయా చలి కాలం రావాలి" అన్నది. చలికాలం వచ్చినాక అడిగితే పిచ్చివాడా! చలికాలంలో కాయలు దొరుకుతాయా, పిందెలు ఉంటాయి ఎండాకాలంలో అడుగు, " అని ఇట్లా ఏదో ఒకసాకు చెప్పుతూ మంగలిని ఒక్క కాయ తిన నివ్వలేదు. ఇంతలో ఎండా కాలం వచ్చింది. కాయలు కాచినై , నక్క ఒకనాటి రాత్రి అడివికిపోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటినన్నిటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి, పొట్ట పట్టినన్ని తిని, మిగతావి తుంచి, కొరికి, మట్టిలో పారవేసిపోయి చక్కగా పండుకొన్నవి.

పాపం, మర్నాడు పొద్దున మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ల వెంబడి నీళ్ళు వచ్చినై. చెట్లుని ఒక్క కాయ లేదు. ఒక్క మూలను మాత్రం గుమ్మడి పాదుకు ఒక గుమ్మడికాయ ఉంది అదీ ఆకులు కమ్మి ఉండటం మూలాన కనపడటం లేదు. నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగళి ఇంటో కి పోయి పొది లో నుంచి మంగలి కత్తులు తీసి బాగా సానపట్టి గుమ్మడి కాయకి చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనపడ కుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు.

మర్నాడు రాత్రి తీరిగ్గా నక్క వచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తున్నది. తోటలో కాయలన్నీ తోటినక్కలు అదివరకే పాడు చేసినై . తోట అంతా గాలించటం మొదలు పెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనపడింది. అది అతి ! ఆశాతో ఒక్కమాటుగా గుమ్మడికాయ మీద దూకింది. ఇంకేం, దానివొళ్లంతా తెగింది. నెత్తురు కారటం మొదలు పెట్టింది. వొల్లంతా మంటలు. ఏడ్చు కుంటూ, కాళ్ళీడ్చుకుంటూ పోయి ఒక రాతిమీద కూర్చున్నది. చాలా సేపటిదాకా నెత్తురు కారిపోతూనే ఉన్నది. ఇక ఇలాంటి తప్పుడుపని చెయ్యకూడదని మనసులోకున్నది.

మంగలిని దొంగముండా కొడుకని తిట్టింది. ఎన్ని తిట్టినా, ఎవరిని తిట్టినా దానినొప్పి తగ్గుతుందా నెత్తురు కారకుండా ఉంటుందా? నెత్తురు కారటం ఆగినతర్వాత బయలు దేరుదా మనుకున్నది. కాని ఆ నెత్తురు ఎండి గడ్డకట్టి అందులో ఇరుక్కుపోయింది అందులోంచి కదలాలేదు, మెదలాలేదు నక్క కి మంగలిమీద భలేకోపం వచ్చింది నన్ను ఇందుట్లోనించి బయటికిరానియ్యి వీడిపని పట్టకపోతే !" అని శాపధం చేసింది

పాపం! ముందు ఇది బయటపడితే కదా మంగలిపని పట్టటానికి. అబ్బాయిలూ, మనంకూడా చూద్దాము, నక్క వాడిపని ఎట్లా పట్టుతుందో

కామెంట్‌లు