తెనాలి రామలింగం

తెనాలి రామలింగం పేరు తెలియని పిల్లలు ఉండరు. అతని కాపేరు ఎలా వచ్చిందనుకున్నారు? తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగ మయాడు. ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు.

చిన్నప్పటినుంచి రామలింగం వట్టి చిలిపివాడు. ప్రతివాళ్లని పేర్లు పెట్టెవాడు,అతనికి నదురు బెదురు ఏకోశానా ఉండేది కాదు. తనకు నచ్చని దాన్ని వెక్కిరించటంలో మొనగాడు .

ఒక రోజున రామలింగం వీధిలో ఆడుకొంటూవున్నాడు. ఒక యోగి ఆ దారిని పోతూ అతన్ని చూచాడు. రామలింగం రూపురేఖల్లోనూ, అతని మాటల్లోనూ యోగికి తెలివి తేటలు రామలింగాన్ని దగ్గరకు పిలిచి శక్తి మంత్రం ఉపదేశించి యిలా చెప్పాడు.

నాయనా! ఈ మంత్రం వెయ్యిసార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే, దేవి నీకు ప్రత్యక్ష మౌతుంది. వెయ్యి తలలతో కనిపిస్తుంది. నీవు భయపడగూడదు. అప్పుడు దేవి మెచ్చి నీవు కోరుకొన్న వరం ఇస్తుంది," అని చెప్పి యోగి వెళ్లి పోయాడు

ఒక మంచిరోజు వచ్చిందాకా ఆగి ఆ నాటి అర్ధరాత్రిపూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్లి యోగి చెప్పిన మంత్రం వెయ్యిసార్లు జపించాడు. కాళికాదేవి 'వెంటనే వేయి తలలతో ప్రత్యక్ష మైంది. రామలింగం భయపడలేదు. అతనికి ఏమితోచిందో ఏమో ఫక్కున నవ్వాడు.

దేవి రామలింగాన్ని "ఎందుకు అబ్బాయీ, నవ్వుతా?" వని అడిగింది. “మీరు కోపగించుకోనుంటే మనవి చేసుకొంటాను," అన్నాడు జంకు గొంకూ లేకుండా రామలింగం

దేవి సరేనన్నది. రామలింగం అప్పుడు చెప్పాడు:

"అమా! మాకు ఒకటే ముక్కు, కాని రెండు చేతులున్నాయి. ఎప్పుడన్నా జలుబు చేస్తే ఈ ఒకముక్కు చీదుకోటాని కే రెండుచేతులు చాలటంలేదు. ఇక మీకా వెయ్యితలలు. కర్మంజాలక జలుబు చేస్తే ఆ వెయ్యిముకులు చీడుకోటానికి ఈ రెండుచేతులు ఎలా దాలుతాయా అని నవ్వు వచ్చింది."

దేవికూడా అతనిమాటకు నవ్వి- నాయనా, నన్ను చూచి నవ్వినవాడివి. ఇక నువ్వు ఎవరిని చూచి నవ్వవు గనుక. నీవు తప్పకుండా వికటకవి వవుతావు," అంది

రామలింగం నమస్కరించి "తల్లీ ఎటు తిప్పి చదివినా చెడనిమాట వరంగా ఇచ్చావు. ఇంతకంటే నాకు ఏమికావాలి." అన్నాడు

కాశిక అతని తెలివితేటలకు మెచ్చు కొన్నది. 'వికటకవి' అనే మాట ఎటు తిప్పిచదివినా మారేది ఏమి ఉంది? దేవి సంతోషించి మరొక వరం కూడా అతనికి ఇచ్చింది. "వీవు రాజాస్దానంలో విదూషీ కూడావుతావు. అంతేకాదు, నీలాగా పద్యం కూర్చటం మరొకరికి చేతకాదు" అని ఆశీర్వదించింది.

రామలింగం వికటకవిగా ప్రసిద్ధి కెళ్లారు. అయన పేరుతో ఎన్నో హాస్య కధలు ఉన్నాయి. ఇవికాక వీరు రెండు మహాకావ్యాలు వ్రాశాడు. ఉద్భటారాధ్య చరిత్ర ఒకటి. పాం డురంగ మాహాత్మ్యం రెండూ

పెద్దవాళ్లయినాక మీరు వాటిని చదువుతారు కదూ.

కామెంట్‌లు