మామిడికాయ రసం

కావలసినవి:
పచ్చిమామిడి కాయ ముక్కలు: కప్పు, 
టొమాటో ముక్కలు: అరకప్పు,
కందిపప్పు: టేబుల్‌ స్పూను,
ఉప్పు: సరిపడా, 
కరివేపాకు: 2 రెబ్బలు, 
ఎండుమిర్చి: మూడు
మిరియాలు: టీస్పూను, 
దనియాలు: టీస్పూన్, 
జీలకర్ర: టీస్పూను, 
అల్లం తురుము: అరటీస్పూను, 
వెల్లుల్లి తురుము: అరటీస్పూను,
ఆవాలు: టీస్పూను, 
పసుపు: టీస్పూను, 
నూనె: టీస్పూను

తయారుచేసే విధానం: బాణలిలో కందిపప్పు
మిరియాలు, దనియాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేయాలి. ఓ గిన్నెలో పచ్చి మామిడికాయ ముక్కలు టొమాటోలు వేసి అవి మునిగే వరకూ నీళ్లు పోసి ఉడికించి చల్లారాక గుజ్జులా చేయాలి. ఆ తరవాత అందులో సరిపడా నీళ్లు పోసి, పసుపు, అల్లం, వెల్లుల్లి తురుము వేసి కలపాలి. కందిపప్పు, మిరియాల పొడిని వేసి కూడా మరిగించాలి. తరవాత ఆ వాలు, ఎండుమిర్చి, కరివేపాకులతో తాలింపు పెడితే సరిపోతుంది

కామెంట్‌లు