గ్రీన్ మ్యాంగో చాట్

కావలసినవి
మామిడికాయలు: రెండు(చిన్నవి),
ఉల్లిపాయ ముక్కలు: కప్పు,
 కొత్తిమీర: కప్పు, 
వేయించిన పల్లీలు: కప్పు,
 ఎండుద్రాక్ష: అరకప్పు,
 కార్న్ ఫ్లేక్స్: ఒకటిన్నర కప్పు, 
గరంమసాలా: టీస్పూను, 
ఉప్పు: తగినంత
 కరివేపాకు పొడి: పావుటీస్పూను, 
చిదిమిన ఎండుమిర్చి పొడి: అరటీస్పూను, 
నూనె: రెండు టేబుల్ స్పూన్లు, 
వెల్లుల్లి: ఒకటి
నిమ్మరసం: 2 టీస్పూన్లు,
తయారుచేసే విధానం

మామిడికాయని చెక్కు తీసి చిన్న ముక్కల్లా కోసి వెడల్పాటి బౌల్ లో వేయాలి. అందులోనే ఉల్లిముక్కలు, కొత్తిమీర తురుము, వేయించిన పల్లీలు,ఎండుద్రాక్ష వేసి కలపాలి. వీటిమీద నిమ్మరసం, నూనె, ఎండుమిర్చి పొడి చిదిమిన వెల్లుల్లి, గరంమసాలా, కరివేపాకు పొడి వేసి కలపాలి. ఈ బౌల్ ని కాసేపు  ఫ్రిజ్ లో పెట్టి వడ్డించే
ముందు కార్న్ ఫ్లెక్స్  పైన చల్లాలి.

కామెంట్‌లు