ఖార్జుర పాయసం

కావలసినవి
గింజల్లేని ఖర్జూరాలు:పన్నెండు,
చిక్కని పాలు: మూడున్నర కప్పులు,
వాల్నట్లు: పావుకప్పు,
పొట్టుతీసిన బాదంపలుకులు: పావుకప్పు,
డ్రై ఫ్రూట్స్: గుప్పెడు,
యాలకులపొడి: అరచెంచా,
నెయ్యి: రెండు టేబుల్స్పూన్లు

తయారీ విధానం: అరకప్పు గోరువెచ్చని పాలల్లో బాదం ఖర్జూరాలు, వాల్ నట్లను నానబెట్టుకోవాలి. పావుగంటయ్యాక అన్నింటినీ మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక బాదం, కిస్ మిస్ పలుకుల్ని వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన పాలు పోయాలి. అవి మరిగి సగం అయ్యాక స్టౌ కట్టే యాలి. ఇందులో వేయించిన డ్రైఫ్రూట్సపలుకులతో పాటూ ఖర్జూరాల ముద్ద, యాలకుల పొడి వేసి అన్నింటినీ కలపాలి

కామెంట్‌లు