మామిడి కారం పులిహోర

కావలసినవి:
మామిడి తురుము: అరకప్పు,
పొడిపొడిగా వండిన అన్నం: ఒకటిన్నర కప్పు,
నూనె: రెండు టేబుల్ స్పూన్లు,
పల్లీలు: పావుకప్పు,
ఆవాలు: పావుచెంచా,
ఇంగువ: పావుచెంచా,
కరివేపాకు:రెండు రెబ్బలు,
పచ్చిమిర్చి: రెండు
సెనగపప్పు: చెంచా,
ఉప్పు: తగినంత
మసాలాకోసం:
దనియాలు: చెంచా, మిరియాలు: అరచెంచా, మినప్పప్పు: చెంచా, సెనగపప్పు: చెంచా, ఎండుమిర్చి: రెండు, మెంతులు: నాలుగు గింజలు.

తయారీవిధానం: స్టామీద కడాయి పెట్టి.. మసాలా
కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ నూనె లేకుండా వేయించి తీసుకోవాలి. వేడి కొద్దిగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టౌ మీద మళ్లీ అదే బాణలి పెట్టి నూనె వేసి ఆవాలు, పల్లీలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. అన్నీ వేగాక మామిడి తురుము కూడా నిమిషం పాటు వేయించి  స్టౌకట్టేయాలి. ఇప్పుడు ఈ తాలింపు, ముందుగా చేసుకున్న మసాలా ఒకటిన్నర చెంచా, తగినంత ఉప్పు అన్నం పైన వేసి అన్నింటినీ కలిపితే చాలు.

కామెంట్‌లు