కొబ్బరిపాల బర్మీ

కావలసినవి
మైదా: కప్పు,
కొబ్బరిపాలు: నాలుగుకప్పులు,
చక్కెర: రెండు కప్పులు,
జీడిపప్పు పలుకులు: కొన్ని
నెయ్యి: పావుకప్పు,

తయారీ విధానం: మైదాను ఓ గిన్నెలో వేసి నీళ్లు పోస్తూ
ముద్దలా చేసుకోవాలి. దాంట్లోనే మరో మూడు కప్పుల నీళ్లు పోసి చేత్తో కలుపుతూ ఉంటే పిండినీళ్లు పైకి తేలతాయి. ఇలా పిండి అంతా నీటిలో కలిసిపోయేవరకూ కలిపి... మూత పెడితే మర్నాటికి పల్చని నీరు పైకి తేలుతుంది. ఆ నీటిని వడకట్టి చిక్కని మైదా మిశ్రమాన్ని మరో గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు స్టామీద కడాయి పెట్టి మైదా మిశ్రమం, కొబ్బరిపాలు, పావు వంతు చక్కెర వేసి అన్నింటినీ కలిపి స్టౌని మీడియంలో పెట్టాలి. మరో బాణలిలో మిగిలిన చక్కెర, నెయ్యివేసి స్టామీద పెట్టాలి. చక్కెర కరిగి పాకంలా తయారవుతున్నప్పుడు దాన్ని మైదా మిశ్రమంలో వేసి మధ్య మధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి దగ్గర పడుతుంది. అప్పుడు జీడి పప్పు పలుకులు వేసి ఓసారి కలిపి నెయ్యి రాసిన ప్లేటులో పరిచి, వేడి కొద్దిగా చల్లారాక ముక్కల్లా కోసుకోవాలి.

కామెంట్‌లు