తెలుగు వర్ణమాల 2

హల్లులు రకాలు : హల్లులు స్థూలంగా మూడు రకాలు.

1. పరుషాలు
2. సరళాలు
3. స్థిరాలు

1. పరుషాలు : కఠినంగా పలుకబడే హల్లులను పరుషాలు అని అందురు.
       ఇవి ఆరు - క, చ, ట, త, ప.

2. సరళాలు : తేలికగా పలుకబడే హల్లులను పరుషాలు అని అందురు.
      ఇవి ఆరు -గ, జ, డ, ద, బ.

3. స్థిరాలు : పరుషములు, సరళములు గాక మిగిలిన హల్లులను స్థిరాలు అని అందురు. ఇవి ఇరువది ఐదు.

ఖ, ఘ, ఛ, ఝ, ఞ

ఠ, ఢ, ణ, థ, ధ, న

ఫ, భ, మ, య, ర, ఱ

ల, ళ, వ, శ, ష, స, హ

స్పర్మాలు (వర్గాక్షరాలు) : “క” నుండి “మ” వరకు గల అక్షరాలను స్పర్శాలు అని అందురు. ఈ స్పర్మాక్షరాలు ఐదు వర్గాలుగా విభజించబడ్డాయి.

1. 'క' వర్గం - క, ఖ, గ, ఘ, ఙ
2. 'చ' వర్గం - చ, ఛ, జ, ఝ, ఞ
3. 'ట' వర్గం - ట, ఠ, డ, ఢ, ణ
4. 'త' వర్గం - త, థ, ద, ధ, న
5. 'ప' వర్గం - ప, ఫ, బ, భ, మ

వర్గయుక్కులు : వర్గాక్షరాలతో చేరియుండే అక్షరాలే వర్గయుక్కులు. ఇవి పది
ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ఫ, భ (ఇవి ఒత్తక్షరాలు).

అనునాసికాలు : ప్రతి వర్గానికి చివర గల అక్షరాలను అనునాసిక అక్షరాలు అని అందురు. ఈ అనునాసికాక్షరాలు ముక్కు సహాయంతో పలుకబడతాయి. ఇవి ఐదు - ఙ, ఞ, ణ, న, మ.

ఊష్మాలు : ఊది పలుకబడే హల్లు అక్షరాలను ఊష్మాలు అని అందురు.

ఇవి నాలుగు - శ, ష, స, హ.

అంతస్థాలు : స్పర్శాక్షరాలకు, ఊష్మాలకు మధ్య ఉండే అక్షరాలను అంతస్థాలు అని అందురు.

ఇవి ఆరు - య, ర, ఱ, ల, ళ, వ

వర్ణోత్పత్తి (అక్షర ఉద్భవం) :అక్షరాలను ఉచ్చరించేటప్పుడు చేసే చేష్టలను అక్షరాలు గొంతులోని ఏ ప్రాంతం సహాయంతో పలుకబడుతున్నాయో వివరించడమే వర్ణోత్పత్తి.

కామెంట్‌లు