వర్ణమాల
తెలుగు భాషకు అక్షరాలు 56. వాటిని మూడు భాగాలుగా విభజించారు.
1. అచ్చులు -16
2. హల్లులు - 37
3. ఉభయాక్షరాలు - 3
1. అచ్చులు (ప్రాణాలు) : “అ” నుంచి "ఔ" వరకు గలవర్ణములను అచ్చులు లేదా ప్రాణాలు, స్వరాలు అని అందురు. అనగా స్వతంత్రంగా పలుకబడేవి. ఇవి పదహారు
అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ.
2. హల్లులు (ప్రాణాలు) : ప్రాణములు కలవి. ప్రాణములగు అచ్చుల సహాయంతో పలుకబడేవి. “క” నుంచి “హ” వరకు గల వర్ణములను హల్లులు లేదా ప్రాణులు, వ్యంజనాలు అని అందురు. ఇవి ముప్పది ఏడు
క, ఖ, గ, ఘ, ఙ
చ, ఛ, జ, ఝ, ఞ
ట, ఠ, డ, ఢ, ణ
త, థ, ద, ధ, న
ప, ఫ, బ, భ, మ
య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ,
3. ఉభయాక్షరాలు : అచ్చుల సహాయంతో గాని, హల్లుల సహాయంతోల గాని పలుకబడే వర్ణములను ఉభయాక్షరాలు అని అందురు. ఇవి మూడు.
1. “0” సున్న
2. “c అరసున్న
3. “ః” విసర్గ
అచ్చులు - రకాలు : అచ్చులు రెండు రకాలు -
1. హ్రస్వాచ్చులు
2. దీర్ఘాచ్చులు.
1. హ్రస్వాచ్చులు : ఒక మాత్ర కాలంలో అనగా తక్కువ కాలంలో ఇవి ఏడ
ఉచ్చరింపబడేవి హ్రస్వాచ్చులు.
అ, ఇ, ఉ, ఋ, ఎ, ఒ.
2. దీర్ఘాచ్చులు : రెండు మాత్రల కాలంలో ఉచ్చరింపబడేవి అనగా కొంత ఎక్కువ కాలంలో పలుకబడే అచ్చులను దీర్ఘాచ్చులు అంటారు. ఇవి తొమ్మిది. ఆ, ఈ, ఊ, ౠ, ఏ, ఔ, ఓ, ఔ.
హల్లులు - రకాలు :
హల్లులు స్థూలంగా మూడు రకాలు.
1. పరుషాలు
2. సరళాలు
3. స్థిరాలు.
1. పరుషాలు : కఠినంగా పలుకబడే హల్లులను పరుషాలు అని అందురు.
ఇవి ఆరు- క, చ, ట, త, ప.
2. సరళాలు : తేలికగా పలుకబడే హల్లులను పరుషాలు అని అందురు.
ఇవి ఆరు- గ, జ, డ, ద, బ.
3. స్థిరాలు : పరుషములు, సరళములు గాక మిగిలిన హల్లులను స్థిరాలు అని అందురు. ఇవి ఇరువైదు.
ఖ, ఘ, ఛ, ఝ, ఞ
ఠ, ఢ, ణ, థ, ధ, న
ఫ, భ, మ, య, ర, ఱ
ల, ళ, వ, శ, ష, స, హ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి