అనగా అనగా ఒక నవాబు. ఆనవా బుకు ఒక్కడే కొడుకు ఒక్కతే కూతురు, కొడుకు చాలసాహసి. మిన్ను విరిగి మీదపడ్డా జంకేవాడుకాదు. పేరు ఫిరోజిషా, కూతురు చక్కని చుక్క పేరు జహనారా.
ఆ నవాబు ప్రతి సంవత్సరం మహా వైభవంగా పీర్ల పండగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడడానికి దేశ దేశాల నుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవాళ్ళు. వచ్చి తమతమ విద్యలనుచూపి నవాబువద్ద బహుమతులు పొందుతుండేవాళ్ళు.
ఒకయేడు ఆ ఉత్సవాలకు ఓ ముసలి శిల్పి వచ్చాడు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడేబొమ్మలు, ఇంకా రక రకాల ప్రతిమలు తెస్తే, ముసలితాత ఒక కొయ్యబొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే తతిమా శిల్పులకు ఎక్కడలేని నవ్వు వచ్చింది.
"ఈ గుర్రాన్ని నువ్వే చేశావా తాతయ్యా." అని అడిగాడు ఒక శిల్పి.
"బలేగుర్రం తాతయ్యా, ఎంత కిస్తా వు?" అని వెక్కరించాడు మరో శిల్పి.
"ఏ మిగుర్రు మనుకున్నా వేమిరా అధి దేవతాగుర్రం, " అన్నాడు మరొక శిల్పి.
"వాళ్లతో నీకెందుకుకాని దీన్ని ఎంతకిస్తావో నిజంగాచెప్పు తాతయ్యా," అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి.
తాతకు కోపం వచ్చింది. "మీరు కొనలేరు, మీ అబ్బలు కొనలేరు. ఎందుకు వచ్చినబాధ ? పొండి, పొండి," అని.
కసిరాడు.
నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూచి మంచివాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానమిచ్చాడు. చివరికి ముసలితాత కొయ్యగుర్రం మిగిలింది. "ఏమిటి దీని విశేషం." అని అడిగారు నవాబు,
"ఏలినవారు చిత్తగిస్తే మనవి చేస్తాను. ఇది వట్టి చూపులగుర్రంకాదు. కీలుగుర్రం. ఇది కనుమూసి కను తెరిచే లోపల చుక్కల్ని చూసినస్తుంది ఆకాశం అంతు కనుక్కొస్తుంది." అన్నాడు ముదివగ్గు.
"టట్ టట్ : అంతా అబద్ధం. అలాంటిది భూలోకంలో ఉండదు." అన్నాను.
"ఏలినవారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను." అన్నాడు. శిల్పి.
"ఇక్కడికి పదికోసుల దూరంలో చందనపర్వతం ఉంది. దానిమీద మసీదు. మసీదుకు పక్కన ఖర్జూరపుచెట్టు ఉంది. పోయి ఆ చెట్టు ఆకు పట్టుకురా చూస్తాను." అన్నాడు నవాబు.
ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రమెక్కి ఏదో బుడుపు లాగా వున్న మీట నొక్కాడు. గుర్రం ఆగమేగాలమీద లేచింది. అది ఎప్పుడు వెళ్లి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలీదు. నవాబు తెప్పరిల్లి చూచేసరికి ఖర్జూరపు ఆకు పుచ్చుకొని శిల్పి ఎదురుగా నుంచు న్నాడు.
నవాబుకు ఎలాగైనా ఆ గుర్రాన్ని సంపాయించా అనిపించింది. "నీకేమి కావాలన్నా కోరి పుచ్చుకో. నాకా కీలు గుర్రం మాత్రం యివ్వు." అన్నాడు.
అయితే మీ కుమార్తెను నాకిచ్చి పెళ్ళిచెయ్యండి," అన్నాడు శిల్పి. అంతా తెల్లదోయారు. శిల్పిమూడు కాళ్ల ముసలి. అందులో సగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు,అలాంటివాడికి చూస్తూ చూస్తూ, చక్కనిచుక్క, పదహారేళ్ల బాలను ఎలా ఇవ్వటం ? నవాబు ఆలోచించ సాగాడు.
నవాబు కొడుకు పిరోజిషా అన్నా డు:—"నీవు గారడీచేశావో లేక, ఆ గుర్రానికే ఆశక్తివుందో తెలీదు. అసలు ఇతరులు ఎక్కితే పోదేమో. నిజం తేల్చుకోకుండా ఎలా తీసుకోవటం నేను పరీక్షిస్తా." అని,
ఫిరోజిషా ఎకాయెకవెళ్ళిని కీలుగుర్రమెక్కి మీటనొక్కాడు. అది రివ్వున లేచి చూస్తుండగానే మబ్బులోకి మాయమైంది. నవాబు, అతని బలగం తెల్ల బోయి చూస్తున్నారు. ఇంత సాహసం జరుగుతుందని ఎవరూ అనుకోలేరు. ఫిరోజిషా తిరిగి వస్తాడని ఎదురుచూస్తూ కూచు న్నారు. మధ్యాహ్నమైంది. ఆ చూకిలేదు. సాయంత్ర మైంది అయిపులేదు, ప్రొద్దుగూకింది. ఆనవాలు లేదు. నవాబుకు పట్టరాని కోసం వచ్చింది. శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తనకొడుకు యిలా అయ్యేవాడు కాదుగా. "వీణ్ణి తీసి కెళ్ళి జైలులో పడెయ్యండి, తరువాత చూదాము అన్నాడు నవాబు .శిల్పిని తీసికెళ్ళి భటులు జైల్లో కోశారు.
ఇక ఫిరోజిషా ఆ కీలుగుర్రంమీద వాయువేగంతో పైకిలేచాడు. ఆ వేగానికి అతనికి భయం కలిగింది. తాను ఎంత ఎత్తున ఉన్నానోనని క్రిందికి చూచాడు. మనుషులు కనిపించలా. చెట్లు కనిపిం చలా. తనకోట కనిపించలా. చందనగిరి
మాత్రం చిన్ని పుట్టలాగా కనిపించింది. దానితో అతని కళ్ళు తిరిగాయి. గుర్రం జూలు గట్టిగా పట్టుకొన్నాడు. అది ఆగకుండా పైకి పోతుంది.
ఫిరోజిషాకు పెద్దలు తలుపుకొచ్చారు. అల్లారుముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. రోజూ తనతో ఆడుతూ పాడుతూ వుండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. స్నేహితులు జ్ఞాపకం వచ్చారు. అతనికి భయం మరీ ఎక్కువైంది. కళ్ళు మరీ గట్టిగా మూసుకొన్నాడు. గుర్రం వాయువేగ మనోవేగంతో
పోతూనే వుంది.
ఇలా కొంతసేపు పోగాపోగా ఫిరోజిషాకు జడుపు తగ్గింది. గుర్రాన్ని క్రిందికిదించటం ఎలాగా అని ఆలోచించాడు. ఎక్కడో దానికి మరొకమీట ఉండితీరాలనుకొన్నాడు. జూలులో వెదికాడు; కనిపించలా. జీను ప్రక్కన ఉన్న చీలలు తిప్పి చూచాడు; లాభం లేకపోయింది. చివరికి విసుగెత్తి దాని రెండు చెవులు పట్టుకొన్నాడు. గుర్రం. వేగం తగి మెల్లగా క్రిందికి దిగ సాగింది. అప్పటికి అతని ప్రాణాలు కుదటపడ్డాయి.
గురపుచెవులు రెండు ఇంకా గట్టిగా వెనకకులాగాడు. చర్రున అది కిందికి దిగసాగింది. అలా దిగిదిగి చివరికి ఒక ఏడు అంత స్థులమేడమీద వాలింది. అప్పటికి బాగా ప్రొద్దుపోయింది. పట్టణ మంతా మాటుమణిగివుంది. పిరోజిషా మెట్లు దిగి ఏడో
అంతస్థు లోపలికి వెళ్ళాడు.అతనికి సంగీతం వినిపించింది.
ఆ శబ్దాన్నిబట్టి వెళ్లాడు. మరకత మాణిక్యాలతో ధగ ధగ మెరుస్తూ వుంది. ఒక పెద్ద గది. లోపలి కెళ్లాడు. అక్కడ ఒక హంసతూలికా తల్పంమీద రాజకుమార్తె పడుకుని ఉంది. ఆమె చుట్టూ చెలికత్తెలు పండుకొని నిద్రపో తున్నారు. ఫిరోజిషా తనకళ్ళను తాను నమ్మలేకపోయాడు. కలగంటున్నానేమో ననుకొన్నాడు. తనవొల్లు తాను గిచ్చు కొన్నాడు. బాధ తెలుస్తూనే వుంది. అప్పు డదంతా నిజమని అనుకున్నాడు.
మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూచాడు. చుక్ర లమధ్య చంద్రుడిలాగా వుంది. బంగారపుజుట్టు, తళతళా మెరు స్తూవుంది. మెల్లగా వెళ్ళి ఆ జుట్టు మెల్లగా తాకాడు. రాజపుత్రి కళ్ళువిప్పి అతన్ని చూచింది.
ఫిరోజిషా ఆమెను ప్రక్షకు తీసుకెళ్లి తన కధంతా చెప్పాడు. తనతో పర్షియాకువచ్చి తన్ను పెండ్లాడ వలసిందని ప్రార్థించాడు. వంగరాజపుత్రికూడా అతన్ని ప్రేమించింది. రెండోవారికి చెప్ప కుండా అతనివెంట బయలు దేరింది.
ఇద్దరూ కీలుగుర్రమెక్కి పర్షియాలో తమ పట్టణంముందు వాలారు.మేళతాలలు బజంత్రీయలు
లేకుండా కొత్త పెండ్లికూతురును అంతః పురానికి తీసుకొనివెళ్ళటానికి ఫిరోజిషా మనస్సు ఒప్పలేదు. రాజపుత్రికకు ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెను, గుర్రాన్ని అక్కడి తోటలోని బంగళాలో దింపి ఒక్కడే ఇంటికి వచ్చాడు.
నవాబు సంతోషానికి మేరలేక పోయింది. వెంటనే శిల్పిని విడుదల చేయించాడు. రాజపుత్రిని తీసుకురావటా నికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈసంగతంతా శిల్పి విన్నాడు. గుప్పుడు చప్పుడుకాకుండా రాజకుమారి దగ్గరకు వెళ్ళి, “మిము ఈ గుర్రంమీద అంతః పురానికి తీసికొనిరమ్మన్నారు,"అన్నాడు. ఆమె నమ్మి కీలుగుర్రమెక్కి అతని వెనుక కూర్చుంది. శిల్పి మీట నొక్కాడు. గుర్రం రివ్వున లేచి పోయింది. మేళతాళాలతో రాజపుత్రికి ఎదురుకోలు ఇవ్వడానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకొన్నది.
ఈ వార్త విని ఫిరోజిషా దిగాలుపడ్డాడు. రాజ పుత్రి లేక, తాను బ్రతకడం కల్ల అనుకొన్నాడు. ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని కాలి నడకను బయలుదేరాడు.
శిల్పి ఎక్కినగుర్రం పోయిపోయి గ్రీసు దేశంలో ఒక మైదానంమీద దిగింది. రాజ కుమారి శిల్పిచేసిన మోసం తెలుసుకొని ఏడువ సాగింది. ఆ ఏడుపు వేటకు వచ్చిన గ్రీసు రాజు చెవులబడ్డది. అతడు చప్పునవచ్చి జరిగిన మోసం రాజపుత్రివల్ల విని శిల్పితల నరికివేశాడు.
గ్రీసురాజుకుకూడా వంగరాజ పుత్రిమీద ప్రేమ ఏర్పడింది. ఇది ఏమాత్రం ఆమెకు ఇష్టంలేదు. రాజు బలాత్కారంనుంచి తప్పుకో టానికి పిచ్చిఎత్తినట్లు నటించసాగింది. దగ్గరకు వచ్చేవాళ్ళను రక్కేది, పీకేది. రాజు ఎంతో చిన్నపోయాడు. ఆమెపిచ్చి కుదర్చటానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు. ఎన్నో మందు లిప్పించాడు. లాభంలేకపోయింది. నిజమైన పిచ్చి అయితేగా అసలు కుదరటానికి?
ఇక్కడ యిలా జరుగుతూవుండగా అక్కడ పర్షియాలో కాలినడకను బయలుదేరిన ఫిరోజిషా ఊళ్ళుదాటాడు, ఉకాలు దాటాడు. చీమలు దూరని చిట్టడవీ, కాకులు దూరని కారడవీ దాటాడు. ఎక్కడా తన రాజపుత్రిజాడ తెలియలేదు. ఏరులు దాటాడు, నదులుదాటాడు, గుట్టలెక్కా డు, మిట్టలెకాడు. చివరికి గ్రీసురాజు పట్టణం చేరుకొన్నాడు. అక్కడ రాజ పుత్రి సంగతి విన్నాడు.
ఫిరోజిషా వైద్యుని వేషంతో రాజు దగ్గరకు వెళ్లి "నాకు భూతవైద్యం తెలుసు. రాజపుత్రి పిచ్చి కుదురుస్తా" నన్నాడు. రాజు సంతోషించి అతన్ని అంతఃపురానికి తీసుకువెళ్లాడు. కొత్త వైద్యుణి చూడగానే రాజకుమారికి వచ్చి కొంచెం తగ్గిపోయింది.
"రాజా, ఈ అమ్మాయికి ఒక కీలు గుర్రంమూలాన ఈ వ్యాధి కలిగింది ఈమెను ఆగుర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిల ధూపం వెయ్యాలి. మంత్రాలు చదవాలి. అప్పుడుగాని ఈ వ్యాధి పూర్తిగ పోదు. పదియేళ్ళ గడువిస్తే కీలుగుర్రం గుర్రం చేస్తాను." అన్నాడు ఫిరోజిషా.
"ఈ భాగ్యానికి పదిసంవత్సరా లెందుకు. మనదగ్గర ఒక కీలుగుర్రం ఉన్నది. దానితో చికిత్స చెయ్యి." అన్నాడు రాజు.
ఫిరోజిషా పాచిక పారింది. రాజ కుమారిని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిలం ధూపం వేయించాడు. ఆపొగతెరలో తానుకూడా కీలుగుర్రం పై ఎక్కాడు. మీట నొక్కాడు. వాయు
వేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరి పోయింది. ఫిరోజిషా బెంగాలు రాకుమారితో క్షేమంగా ఇంటికివచ్చిచేరాడు. వారిద్దరికీ వైభవంగా పెండ్లి జరిగింది. పెండ్లి నాటి రాత్రి బెంగాలురాకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టించింది. దానితో వాళ్ళకష్టాలు తీరిపోయాయి. హాయిగా రాజ్యం ఏలుకుంటూ నూరేళ్ళు బ్రతికారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి