కాకుల పురాణకాలంనించికూడా ప్రసిద్ధిగన్నవి. వెనక ఎప్పుడో ఒక కాకి అగస్త్యుడి కమండలం ఒలకబోసిం దట. అప్పుడు అందులో ఉన్న గంగ బయటికి వచ్చి నదిగా ప్రవహించింది. శ్రీరామచంద్రుడు సీతతో అరణ్యంలో ఉన్నప్పుడు ఒకనాడు ఒక కాకివచ్చి సీతామహాదేవి రొముమీద పొడిచింది. రాముడికి కాకిమీద ఆగ్రహం వచ్చింది. దగ్గిర ఉన్న గడ్డిపరక ఎత్తి కాకిమీద విసిరాడు. కాకి భయపడి మూడులోకాలూ తిరిగింది. రక్షించేవారు లేక ఆఖరుకు రామచంద్రుడినే శరణువేడింది. కాకికి ప్రాణం దక్కిందిగాని ఒక కన్ను పోయింది.
ఆనాటినుంచీ కాకులకు ఒంటికంటి చూపే. కాకి ఎట్లా చూస్తుందో మీ రెరుగు దురుగాదూ ?
కాకులలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనుషుల లో కూడా లేవు. వాటిలో వర్ణ భేదంలేదు. అందుకనే 'తెల్లనికాకులునులేవు తెలియర సుమతీ' అన్నాడు కవి. కొన్ని కాకులను మనం మాల కా కు లంటాం. కాని నిజంగా వాటిలో అంటరానితనం లేదు. కాకులు ఇళ్ల కప్పుల మీద వరసగా కూర్చుని చదువుకోవటం చూశారా? దాన్నే కాకి బడి అంటారు. కాకుల్లో ఇంకో మంచి బుద్ధి కూడా ఉంది. ఒక కాకికి తినేటందు కేమైనా దొరికితే అన్ని కాకులనూ పిలు స్తుంది. అంతేకాని తనపొట్టకు మాత్రమే చూసుకోదు. వీటినిబట్టి కాకులు చాలా గొప్పవని చెప్పవచ్చు.
అటువంటి ప్రసిద్ధిగన్న కాకి వంశంలో పుట్టింది మన కాకమ్మక్క. ఆవిడ గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆవిడ గొంతెత్తి కధ, కాకభైరవీ మొద లైన రాగాలు పాడితే దిక్కులు మారు మోగుతాయి. వినేవాళ్ల చెవులు చిల్లులు పడతాయి.
కాకమక్కయ్య మొగుడు కాకినావ. చాలా విద్యలు నేర్చినవాడు. పిల్లల నెత్తి కొట్టి చేతిలో ఉన్న అప్పచ్చులు కా జెయ్యటంలో నేర్పరి. ఇన్ని గొప్ప గుణాలుచూసే కాకమ్మక్క కాకినాడను వరించింది.
ఒకనాడు పొద్దున్నే కాకిబావయ్య
కాకమ్మక్కయ్యతో అన్నాడు గదా: "ఒసే, కాకామణీ : మనం ఈపూట ఎక్కడికైనా మంచిచోటికి విందుకుపోతే ఎట్లా ఉంటుందే ?" అన్నాడు.బావకు సంతోషంగా ఉన్నప్పుడు అక్షయ్యను కాకామణీ అని పిలుస్తాడు.
"బాగానే ఉంటుంది. ఎవరి ఇంటికి పోదాం?" అని రాగం తీసింది కాకము. కాకమ్మక్క ఎప్పుడూ మామూలుగా మాట్లాడదు. సంగీతంలో తప్ప,
"దగ్గిరే నాయుడుగారిల్లుంది. పొద్దుటి పూట వారింటో చక్కని ఇద్దెనలూ, ఉప్మా చేసుకుంటారు. అయితే నాయుడు గారు కుంభకర్ణుడు. బారెడు పొద్దెక్కి గాని లేవడు. ఏం మనుషులో వీళ్ళు మనలాగా వీళ్లకు తెల్లారుజామునే లేచే అలవాటులేదు. వొట్టి సోమరిపోతులు. మన యిద్దరమూ నాయుడు గారింటికి పోదాం. నువు కమ్మగా ఆయనకు మేలు కొలుపులు పాడు. అప్పుడాయన లేచి మనకు ఫలహారం పెట్టిస్తాడు,"అన్నాడు కాకిన.
నాయుడుగారి ఇంటిపకనే వేపచెట్టు ఒకటి ఉంది. దానికొమ్మ ఒకటి మేడ మీదికి ఉంది. ఆ కొమ్మమీద కాకి దంప తులు కూర్చున్నారు. ఇద్దరూ గొంతులు కలిపి ముచ్చటగా నాయుడు గారికి మేలు కొలుపు పాడ నారంభించారు.
"కాకా! కాకాక్రా! అక్రా : కిర్ క్రీ. క్రా ణి. "కా అఅఅఁ కా అఅఅః క్రా అఅఅః క్రు క్రీర్ " కాకిపాటకు ఎంతటివాడైనా నిద్రలేవవలిసిందే. కాకిపాట రుషుల తపస్సు కూడా భగ్నం చెయ్యగలదు. కాని నాయుడుగారు ఎద్దుమొద్దు స్వరూపం. అందుచేత ఆయన కాకిదంపతుల పాట లక్ష్యం చెయ్యకుండా గురక పెట్టి నిద్ర పోతున్నాడు.
అందుచేత మన కాకిదంపతులు స్థాయి హెచ్చించి రాగం మార్చి ఇంకో మాంఛిపాట ఆరంభించారు. కాకలై రవి ఆలాపన జోరుగా సాగింది. అంతకంతకూ పంచమస్థాయికి వెళ్లింది ఎట్లాగైతేనేం నాయుడుగారు లేచాడు. కాని : 2 కాకిపాట ఆనందించటానికి బదులు తనచేతికర్ర కారులమీదికి కోపంగా విసిరివేశాడు. అది కాస్తా వేపకొమ్మల మధ్య చికుకు పోయింది. చేసేదిలేక, నాయుడుగారు నౌకను ఫలహారం పట్టుకురమ్మని కేకవేసి ముఖం కడుక్కోవ టానికి వెళ్లాడు.
నౌకరు నాయుడుగారి పలహారం పట్టుకొచ్చి గదిలో పెట్టి. వెళ్లాడు. ఆరు ఇడ్డెనలూ, కమ్మని నెయ్యీ, గారెలూ, బిస్కట్లూ, వెన్నా, అన్నీ పళ్లెంలో ఉన్నాయి.
కాకిబావా కాకమ్మక్కయ్యా చెట్టుమీదనుంచి దిగివచ్చి ఫలహారం ప్రారంభించారు. కాకమ్మక్కయ్య వొక్క ఇడ్డెనూ, వొకగారే తిన్నది. కాకిబావ మాత్రం దిట్టంగా తిన్నాడు. అయితే ఇద్దరూ వెన్న నంజుకున్నారు. ఇద్దరి ముక్కలకు వెన్న అంటింది. ఇద్దరూ కాసిని మంచి నీళ్ళు తాగారు. కాకివ నాయుడుగారి తివాసీ మీద ముక్కు తుడుచుకున్నాడు.
కాకమ్మక్కయ్య పక్క గుడ్డలతో తుడుచుకున్నది
ముక్కు తుడుచుకుంటు ఉండగా కాకిబావకు మంచి ఆలోచన కలిగింది. ఫలహారం పళ్లెం మంతా తనుపట్టుకు పోతే ఎంతబాగుంటుంది. అన్ని ఆలోచన
బాగానేఉంది కాని పట్టుకుపోవటం ఎట్లా? ఫలహారం పళ్లెం ముక్కుకు అరపదు, అందుకని కాకిబావ ఫలహారం పళ్లెం
కిందఉన్న గుడ్డను ముక్కుతో పట్టుకు లాగాడు. బల్లమీద పళ్లెమూ, గిన్నెలూ, గ్లాసులూ పెద్ద చప్పుడుతో కింద పడ్డాయి. ఇక గచ్చిస్. అక్కడ ఏంజరిగిందో కూడా చూడకుండా కాకిబావా, కాక మ్మక్కయ్యా ఊళ్లోకి ఉడాయించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి