పొట్టి పిచిక కథ

అనగా అనగా ఓ పూర్లో వక పొట్టి పిచిక వుండేది. అదేం చేసిందీ, ఊరల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి సెనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ, ఇల్లం టివి ఎన్నో గింజలు పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టిచేసుకుంది. చేసుకుని, చింత చెట్టుమీద కూర్చుని, ఆపిచిక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ, ఎగరేసుకుంటూ, తింటూ ఉంటే, చీమతలకాయంత ముక్క చెట్టుతొర్రలో పడి పోయింది.

అప్పుడా పిచిక ఏం చేసిందీ వడ్రంగి దగ్గరకి వెళ్లి, వడ్రంగి, వడ్రంగీ, అతి కష్టపడి కొండంత రొట్టెచేసుకుని తింటూంటే చీమ తలకాయంతముక్క చెట్టు తొర్రలో పడాపోయిందోయ్ అది తీసి పెట్టాలోయ్," అంది

వడ్రంగి 'చీమ తలకా యంత ముక్కకై చెట్టు కొట్టాలా?' అని పక పక నవ్వాడు.

అప్పు పిచిక కెంతో కోపంవచ్చి తిన్నగా రాజు దగ్గిరకి వెళ్లి, "రాజుగారూ, రాజుగారూ! అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకొని తింటూంటే చీమ తలకా యంతముక చెట్టుతొర్రలో పడిపోయింది. తీసిపెట్ట మని వడ్రంగి నడిగితే తీయనన్నాడు. వడ్రంగిని దండించు రాజా." అంది.

రాజుకూడా నవ్వి, 'ఇంత చిన్నపనికి వడ్రంగిని దండించాలా? దండించను పో' అన్నాడు రాజు.

'అమ్మా వీడిపని ఇలా ఉందా ' అని ఆ పిచిక వెంటనే లేళ్ల దగ్గిరకి వెళ్లి జరిగింది చెప్పి, “చెట్టు కోట మంటే వడ్రంగి కొట్ట నన్నాడు. వడ్రంగిని దండిం చమంటే రాజు దండించ లేదు. రాజుకు ఉద్యానవన మంటే ఎంతో ఇష్టం. ఆది పాడుచెయ్యండి లేళ్లూ " అంది.

"ఈ చీమతలకాయంత రొట్టిముక్కకి చక్కటి రాజు పూలతోట పాడు చేస్తామా ? చాలు, చాలు పో," అన్నాయి లేళ్లు.

"అమ్మ: వీటమ్మ కడుపు కాలా! ఈ వెధవ లేళ్ళకు ఇంత తెగులా!" అని ఆ పిచిక ఏంచేసిందీ, బోయ వాడి దగ్గరికి వెళ్లి.

‘బోయాడూ! బోయా డూ! చీమ తలకాయంత రొట్టెముక్క చెట్టుతొర్రలో పడిపోయింది.తియ్యమంటే వడ్రంగి తీశాడుకాడు. వడ్రంగిని దండించమంటే రాజలా చెయ్యలేదు. రాజు పూలతోట పాడుచెయ్య మంటే లేళ్లు పాడుచెయ్య లేదు, లేళ్ల కాళ్లు విరకొట్టు బోయాడూ!" అంది.

ఇదంతా విని బోయ వాడు, 'ఈపాటి భాగ్యానికి చెంగు చెంగని గెంతే లేళ్లు  కాళ్లను విరక్కొట్టనా? బాగానే వుంది. వెళ్లు వెళ్లు, అని పంపేశాడు.

దాంతో పిచిక్కి కోపమెక్కువై ఎలక దగ్గరకు వెళ్లి, 'ఓయ్, ఎలకా: ఎలకాః ఓ సహాయం చేసి పెట్టాలి. చీమ తలకాయంత రొట్టి ముక్క చింతచెట్టుతొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీశాడుకాడు. వాడ్ని దండించమంటే రాజలా చేశేడుకాదు. రాజు గారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్లలా చేశా. యికాదు. లేళ్ల కాళ్లు విర క్కొట్టమంటే బోయ విర క్కొట్టేడుకాదు. బోయ చెప్పులు కొరికి పాడుచెయ్యి ఎలక" అంది.

ఎలికె కూడా "నా వల్ల కాదు పొ" మ్మని అంది.

"అమ్మ దొంగముండా, నీకెంత గర్వమేః అని పిల్లి దగ్గిరకి వెళ్ళి, "పిల్లి బావా : పిల్లి బావా: చీమతలకాయంత రొట్టెముక్క చెట్టుతొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగితీ సేడుకాడు, వడ్రంగని దండిచామంటే అలా చెయ్యలేదు. రాజు పూల తోట చెరుపమంటే లేళ్లలా చెయ్యలేదు. లేళ్ల కాళ్ళు రొక్కొట్టమంటే య విరకొట్టాడు కాదు. బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికిందికాదు. ఎలుకను వేటాడు పిల్లీ :" అంది.

"నాకిప్పుడు చాలా పనులున్నాయ్. ఇదే పనా ఏమిటి అని పిల్లి వెళ్ళి పోయింది. 'అయ్యొ దీని దర్జా మండా ఉండు దీని పని పడుతాను. 'అని తిన్నగా అవ్వ దగ్గరకెళ్లి, 'అవ్వా, అవ్వా, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టుతొర్రలో పడితే వడ్రంగి తీసేడుకాదు. రాజు వడ్రంగిని దండించాడు. కాదు. రాజు గారి పూల తోటను లేళ్లు పాడుచెయ్య లేదు. లేళ్ల కాళ్లు విరక్కొట్ట లేదు బోయ. ఎలక బోయ చెప్పులు కొరకలేదు. పిల్లి ఎలుకను వేటాడలేదు. పిల్లి మీద వేడి వేడి పాలొయ్యి అవ్వా,” అంది.

'చీమతలకాయంత రొట్టిముక్క కోసం పిల్లిమీద పాలోస్తానూ? చాలుచాల్లే,' అని అవ్వ కసిరి పొస్తుంది.

"ఏమి తూలిపోతున్నావే! మామ్మా!" అని తిన్నగా తాతయ్య దగ్గిరకి వెళ్ళి, “చీమతలకాయంత రొట్టి ముక్క తొర్రలో పడిపోతే, వడ్రంగి తియ్యనన్నాడు. రాజు వడ్రంగిని దండించాడు. కాదు. లేళ్లు రాజుగారి పూలతోట పాడుచేశాయి. కాదు. రేళ్ల కాళ్ళు బోయ విరక్కొట్టలేదు. బోయ చెప్పులు ఎలక పీకలేదు. అవ్వ పిల్లి మీద వేడి పాలొయ్యలేదు. అవ్వను చితకొట్టు తాతా!" అంది.

అమ్మో, నేనలాచేస్తానాః చెయ్యను పో,' అన్నాడు. తాత. 
"ఓహోత గర్వ మా సరే" అని ఆపిచికేం చేసిందీ, గబగబా అవుదగ్గిర కెళ్ళి, "ఆవు పిన్నీ, ఆవు పిన్నీ : చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడి పోతే వడ్రంగి తీ సేడుకాడు. రాజు వడ్రంగిని దండించ లేదు రాజు పూలతోట లేన్ల పాడుచెయ్యలేదు. లేళ్ల కాళ్లు బోయవాడు విరగ్గొట్టలేదు. బోయ చెప్పులు ఎలక కొరకలేదు. ఎలకను పిల్లి వేటాడలేదు. పిల్లి మీద అవ్వ వేడిపాలొయ్యలేదు. తాత అవ్వను చితక్కొట్ట లేదు. తాత, పాలుతీయ్య డాని కొచ్చినపుడు 'ఫెడీ' మని తన్ను ఆవూ." అంది.

'అబ్బే. నే నలాచెయ్యను 'సుమా' అంది ఆవు. అప్పుడు పిచిక విచారిస్తూ, "పొద్దున్నే లేచిఎవరిమొహం చూశానో, ఎవళ్ళ నడిగినా ఏమీ చెయ్యనంటున్నారు " ఎలాగో" అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతట్లో ఓ ఈగ ఆ దారమ్మట పెడుతూ "ఏం పిచికా ఏడుస్తున్నా" వంటే, పిచిక జరిగినదంతా చెప్పి ఉపకారము చేసి పెట్ట మంది.

అప్పుడు ఈగ ఏం చేసిందీ, వెంటనే వెళ్లి ఆవు చెవులో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాతకి కోపంవచ్చి అవ్వని చితకకొట్టాడు. అవ్వకు వాళ్ళుమండి పిల్లి మీద వేడి పాలోసింది. పిల్లి కోపం కొందీ ఎలక వెంటపడింది.. ఎలక భరించలేక బోయ చెప్పులు కొరికింది. బోయ ఆకోపం తీర్చుకోడానికి లేళ్ల కాళ్లను విరగకొట్టేడు. లేళ్ళు కోపంచేత రాజుగారి తోటను పాడుచేశాయి. రాజుకి బుద్ధివచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చి నట్టు చెట్టును నరికి, తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టిముక్కనూ, తీసి పిచిక చేతిలో పెట్టేడు.

పిచిక మళ్లీ ఎగవేసు కుంటూ ఎగవేసుకుంటు రొట్టెముక్కను కమ్మగా తిన్నది.

కామెంట్‌లు