రుద్రమ్మ

మనం మూడుసార్లు మహాసామ్రా జ్యం స్థాపించాము. మొదటిది ఆంధ్ర సామ్రాజ్యం, రెండోది కాకతీయ సామ్రాజ్యం, మూడోది విజయనగర సామ్రాజ్యం. ఈ మూడుసామ్రాజ్యాలు దక్షిణ దేశానికి చేసినసేవ అంతా యింతాకాదు. వీటిని నెలకొల్పకుండా ఉన్నట్లయితే దక్షిణదేశ చరిత్ర మరొక విధంగా ఉండేది.

ఈ సామ్రాజ్యాలను సమర్థతతో పరి పాలించినవారిలో స్త్రీలుకూడా ఉన్నారు. వారిలో రుద్రమ్మ ముఖ్యురాలు,

కాకతి గణపతిదేవ మహారాజుకు ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా రుద్రమ ఒక్కతే. తండ్రి తరువాత రాజ్యం చేయవలసింది ఆమే. అందు వల్ల గణపతిదేవుడు రాజుకు కావలసిన విద్యలన్నీ రుద్రమ్మకు చెప్పించ సాగాడు. రుద్రమ్మ కత్తిసాము నేర్చింది. గుఱ్ఱపుస్వారి నేర్చింది. సేనలను నడప నేర్చింది. కోటలుపట్ట నేర్చింది. ఇంకా మంచిరాజుకు ఎన్ని విద్యలు కావాలో అన్ని విద్యలు నేర్చుకొంటూవుంది.

ఇది మాత్రం తల్లి నారమ్మకు నచ్చ లేదు. అప్పుడప్పుడు నారమ్మ భర్త గణపతిదేవునితో అంటూ వుండేది: "ఆడపిల్లకు కత్తిసాములేమిటి, ఏ సంగీ తమో, ఏ చిత్రకళ నేర్పించక. ఆడ పిల్ల అన్నతరువాత ఆడపిల్లేకాని మగ పిల్లవాడు అవుతుందా? ఇవ్వాళ కాకపోతే రేపైనా ఒకయ్యచేతిలో పెట్ట వలసిందేగా" గణపతిదేవుడు అతీపతీ చెప్పేవాడు కాదు. నవ్వి వూరుకొనేవాడు.

రుద్రమ్మ సాముగరిడీలు నేర్చు కోవటం ఆమె చెలికత్తెలకుకూడా  విడ్డూరంగా వుండేది. లోలోన కొంత అసూయ పడేవారుకూడా. ఎలాగైనా ఆమె మనస్సు చిన్నపుచ్చి మాన్పించా అనుకొన్నారు. ఏమిచేస్తే బాగుంటుందా అని గుఁగుసలు పోయారు. అదికాద న్నారు. ఇదికాదన్నారు. చివరికి ఎలా గైతేనేం ఒక నిర్ణయానికి వచ్చారు..

ఆనాడు రుద్రమ్మ ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చునివుంది. అప్పుడే ఒక్కొక్క చెలికత్తెవచ్చి, "జయము జయము యువరాజా!" అంటూ ప్రక్షన నిలబడింది. రుద్రమ్మ తొణకలేదు, బెణకలేదు. ఠీవిగా తల ఆడిస్తూ అలాగే కూర్చున్నది. చెలికత్తెలు వెలవెలపోయి బొమ్మలులాగా నిలబడ్డారు. ఉలికేవాళ్లను ఉలికించవచ్చుకాని ఉలకనివాళ్ల ను ఏమి చేస్తారు?

రుద్రమ వాళ్లను తానే పలకరించింది. "యువరాజుతో మీరు చెప్పుకోగల మనవి ఏమిటి," అని అడిగింది. చెలి కత్తెలు నీళ్లు నమిలారు. "మీకువచ్చిన పరవా ఏమీలేదు. మీరు ఏమికోరినా యిచ్చివేస్తాను." అంది రుద్రమ్మ. చెలికత్తెలు ఒకరిముఖం ఒకరు చూచు కొన్నారు. అది అడిగితే బాగుండును, ఇది అడిగితే బాగుండునని ఒకరికొకరు సైగ చేసుకొన్నారు.. చివరికి పెద్ద చెలికత్తె చేతులు జోడించి, "మీరు ఆయుధాలు ఇక ఎన్నడూ ముట్టకపోతే చాలు. అంతకన్నా మాకు కావలసిం దేముంది ?" అన్నది.

రుద్రమ్మ మనస్సు కటకటపడ్డది. ఇంతకాలం నేర్చుకొన్న సాముగరిడీలు ఏమికాను ఆయుధం ముట్టకపోతే తన తండ్రి మనస్సు ఎలా వుంటుంది? మాట తప్పితే చెలికత్తెలకు తనమీద గౌరవం ఏమి ఉంటుంది? ఆమె ఆలో చించి, ఆలోచించి చివరికి అన్నది. "సరే అలాగే, కాని నన్ను ముందు సాముగరిడీలలో ఓడించాలి. ఆపని ఎవరుచేసినా మళ్లీ ఆయుధం పట్టను." "

కలకు ఎక్కడలేని సంతోషం వచ్చింది. సరేనంటే సరేనన్నారు. ఈ సంగతి రాణి నారమ్మకు చెప్పారు. ఆమెకూడా మురిసిపోయింది. కూతురు చేత సాముగరిడీలు మాన్పించవచ్చు ననుకొంది. వెంటనే మంత్రిని పిలిపించి సంగతి చెప్పించి, కత్తిసాములో ఆరితేరిన రాజకుమారుణ్ణి పిలిపించమన్నది. మంత్రి నవ్వాడు. రాణి ఆశ్చర్యపడి, "నిన్న కాక మొన్న నేర్చుకొన్న ఆడ పిల్లను ఓడించలేరా? నేను నమ్మను. ఆమాత్రపువీరులు ఉండకపోరు. మహా రాజుగారివల్ల మాటవస్తుందని భయపడ కండి. వారికి నేను చెబుతాను," అన్నది. మంత్రి వినయంగా చెప్పాడు: -"కాకతీయ వంశ చరిత్ర మీకు సరిగా తెలియదు. తాతముత్తాతలనాటి నుంచి నేను ఎరుగుదును. కత్తిసాములో ఈ వంశం అందెవేసిన చేయి. ఈ వంశంలో పుట్టింది రుద్రమ్మ. ఐనా నేను మెప్పుకు అంటున్నానని మీకు సందేహం కలుగు తుంది. మన సేనానికొడుకు సంగతి మీరు వినేవుంటారు. కత్తిసాములో అతన్ని మించినవాళ్లు ఈ రాజ్యంలో లేరు, రేపేపిలిపించి పోటీ జరుపుదాము. మీకే నిజం తెలుస్తుంది." అన్నాడు. మరునాడు రుద్రమ్మకూ, సేనాని కొడుకుకు మంత్రి రాణి సమక్షణా కత్తి సాములో పోటీ పెట్టించాడు. రుద్రమ్మ అనాయాసంగా సేనాని కొడుకును ఓడించి వేసింది. నారమ్మ తనకళ్లను తాను నమ్మలేకపోయింది. ఆపోటీ చూచి నప్పటినుంచి కూతురు చేత సాముగరి డీలు మానిపించాలన్న పట్టుదల మరీ ఎక్కువై పోయింది. భర్త గణపతిదేవు నితో పోరు ఎలాగైతేనేం ఆయనను ఒప్పించింది. వెంటనే రాజ్యమంతటా రుద్రమ్మను ఓడించినవారికి ప్రధాన సేనాని పదవి యిస్తాము,” అని చాటింపు చేశారు.

మేము ఓడించగలమంటే మేము ఓడించగలమని కొమ్ములు తిరిగి యోధులు, రాజకుమారులు వచ్చారు. కాని రుద్రమ్మను ఓడించినవారు లేక పోయారు. ఇక రుద్రమ్మకు ఆయుధం విడిచిపెట్టవలసినపని లేకపోయింది.

ఈ రుద్రమదేవే గణపతి దేవుని తరువాత చాలకాలం అంగరంగ వైభోగంగా కాకతీయరాజ్యం ఏలింది. ఈమె మనుమడే ప్రతాపరుద్రదేవుడు. ఈమె పరిపాలనలో జరిగిన విశేషాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకోమాటు మీకు చెప్పుతాను. 

కామెంట్‌లు