ఆడపిల్లల పాటలు

పెదచెరువు గట్టునా భేరి వాగింది

పెళ్లి వారొచ్చారు పెద వీధిలోకి ! పసుపు కుంకాలన్ని

పెళ్లాల బట్టి, రండి పేరంటాళ్లు, రెండెదూరు కుందాం!

పానకపు కావిళ్లు బుజాన్ని పెట్టి,

రావయ్య బ్రాహ్మడా, రావయ్య త్వరగ!

పెళ్లమ్మ మా యింట్లొ ! పెళ్లి మా యింట్లొ !

పేరైన సీతమ్మ పెళ్లి మా యింట్లొ !

పెళ్లి పెళ్లినగానే పెరిగెబుగ్గల్లు! పెళ్లైన మర్నాడు తీసెబుగ్గల్లు!

కామెంట్‌లు