ఒకటి ఒకటి రెండు
అవ్వ బోడి గుండు
దూది నిమ్మ పండు
గాజు గోలి గుండు
ఒకటి ఒకటి రెండు.
రెండు రెండు నాల్గు
పంతులమ్మ నీల్గు
బిచ్చగాని మూల్గు
తేనెవంటి తెల్గు
రెండు రెండు నాల్గు.
మూడు మూడు ఆరు
కంది పప్పు చారు
పేరు లేని ఊరు
అత్తగారి పోరు
మూడు మూడు ఆరు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి